ఘటన స్థలాన్ని పరిశీలించిన రేంజ్ ఆఫీసర్ రమేష్
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కులపల్లి గ్రామంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన సపవట్ కేవ్లా ఉదయం పత్తి చేనులో పనిచేస్తుండగా ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి అడుగులను గుర్తించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలుగుబంటి తిరుగుతుందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలుగబంటి పిల్లలతో ఉంటే మరింత జాగ్రత్త అవసరమని, పొదలు ఉన్నచోట జాగ్రత్తగా ఉండాలని గుంపులు గుంపులుగా వెళ్లాలని అన్నారు. గాయపడిన రైతును మంజీలాల్ చేనులో నుంచి ఊరిలోకి ఎత్తుకొచ్చి గాయపడిన తక్కువ సమయంలోనే ఆసుపత్రికి చేర్చి రక్తస్రావం ఎక్కువ కాకుండా ప్రాణాలు కాపాడినందుకు బీట్ ఆఫీసర్ మంజిలాలను మెచ్చుకున్నారు. బీట్ ఆఫీసర్ సోమ, సర్పంచ్ ఫుల్ సింగ్ పాల్గొన్నారు. రైతు మొదట నల్లబెల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో.. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Recent Comments