Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్చల్లగా బీర్లు తాగేస్తున్నారా.. రోగాలన్నీ మీ వెంటే..!

చల్లగా బీర్లు తాగేస్తున్నారా.. రోగాలన్నీ మీ వెంటే..!

 స్పాట్ వాయిస్, డెస్క్:  సమ్మర్ లో కూల్ కూల్ గా బీర్లు లాగించేస్తున్నారా… మీ ఆరోగ్యం దెబ్బతిన్నట్లే. 650 ml బీరు లో 5-7.5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. బీరుకు బానిసలవ్వడం వల్ల స్థూలకాయులుగా మారతారు. నాడీ వ్యవస్థపై ఆల్కహాల్‌ ప్రభావం పడుతుంది. ‘సెరబెలామ్‌’పై దుష్ప్రభావం పడి శరీర కదలికలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడుపై దుష్ప్రభావం చూపడంతో ఆలోచనాశక్తి తగ్గిపోతుంది. కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదమూ ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో ‘మిథైల్‌ డొపిన్‌’ వంటి బీపీ మాత్రలపై ఆల్కహాల్‌ దుష్ప్రభావం చూపి, ఆ మాత్రల ప్రభావాన్ని తగ్గిస్తుంది. బీపీ స్థాయి పెరిగి.. గుండె లయ తప్పుతుంది.

గ్లూకోజ్ తగ్గే ఛాన్స్
బీర్లు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలోని నీరు, సోడియం, పొటాషియం.. మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఫలితంగా డీహైడ్రేషన్‌కు దారితీసే ప్రమాదముంది. గ్లూకోజ్‌ ఉత్పత్తిపై ఆల్కహాల్‌ ప్రభావం చూపుతుంది. ఫలితంగా మధుమేహుల్లో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గి.. ‘హైపోగ్లేసిమియా’ అనే ప్రమాదకరస్థితిలో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ఊబకాయం..
కడుపులో జిగురు పొరను ఆల్కహాల్‌ దెబ్బతీస్తుంది. ఫలితంగా అల్సర్లు ఏర్పడి, రక్త వాంతులు.. విరేచనాలు అవుతాయి. కడుపులో మంట, ఛాతీలోకి ఆమ్లం ఎగబాకడం వంటి పరిస్థితులూ ఎదురవుతాయి. వేసవిలో శీతల పానీయాలు కూడా ఎక్కువగా తాగుతుంటారు. వీటితో రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఊబకాయం బారినపడతారు. కాబట్టి బీర్లు, శీతల పానీయాలు మోతాదుకు మించి తీసుకోవద్దు.

బీర్లు ఎక్కువగా తాగితే వచ్చే సమస్యలివి
1. మానసిక అసమతుల్యం ఏర్పడుతుంది.
2. అదేపనిగా తాగితే శ్వాసవ్యవస్థపై ప్రభావం పడి.. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
3. అసహనానికి లోనవుతారు.
4. ఏ పనిచేయాలో.. చేయకూడదో నిర్ణయించుకునే విచక్షణ కోల్పోతారు.
5. మానసిక ఆందోళన, కుంగుబాటు సమస్యలుంటే.. మరింత ఎక్కువవుతాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments