Saturday, November 16, 2024
Homeజిల్లా వార్తలుప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి..

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి..

వరంగల్ తూర్పు నియోజకవర్గ నేత గంట రవికుమార్
బీరన్న ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు
స్పాట్ వాయిస్, వరంగల్: బీరన్న చల్లని చూపు ప్రజలపై ఉండాలని, వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బీజేపీ తూర్పు నియోజకవర్గ నాయకుడు గంట రవికుమార్ అన్నారు. తొలి ఏకాదశి పర్వ దినాన్ని పురస్కరించుకొని 40 డివిజన్ పరిధి లోని కరీమాబాద్ బీరన్న ఆలయంలో గురువారం బీరన్న బోనాలు తీశారు. ఈ బోనాల వేడుకకు గంట రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమ కులస్తుల వారసత్వ సంపదగా వస్తున్న ఈ పండుగ ఉత్సవాలను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలు, సంతోషాలతో జరుపుకుంటురన్నారు. బీరన్న ప్రత్యేక పూజలు చేసిన గంట రవికుమార్ నగర ప్రజలు సుభీక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆడబిడ్డలు బోనాలను నెత్తిన ఎత్తుకొని డప్పుచప్పుళ్ల మధ్య బీరన్న ఆలయానికి చేరుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించి నియమనిష్టలతో కొలిచారు. బోనాలను మహిళలు ఎత్తుకొని దేవాలయానికి రాగా ఆధ్యాత్మికం ఉట్టిపడింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments