Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుజాగ్రత్తగా ఉండండి..

జాగ్రత్తగా ఉండండి..

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేస్తే కఠిన చర్యలు
గణపురం ఎస్సై మచ్చ సాంబమూర్తి
ఇద్దరిపై కేసు నమోదు
స్పాట్ వాయిస్, గణపురం: ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కానీ పోస్టులు కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మచ్చ సాంబమూర్తి హెచ్చరించారు. శనివారం గణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెల్పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మనోభావాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తితో పాటు గ్రూప్ అడ్మిన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మీడియాతో చెప్పారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. చెల్పూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డిపై చెల్పూర్ సమాచార వాట్సాప్ గ్రూపులో అదే గ్రామానికి చెందిన ఎంజాల సురేష్ అసభ్య పదాలతో కించపరిచేలా ఒక ఆడియోను పోస్ట్ చేశాడు. దీంతో సత్యనారాయణ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు సురేష్ తో పాటు గ్రూప్ అడ్మిన్ జెట్టి కనకరాజుపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇతరుల మనోభావాలను దెబ్బతినేలా సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టులు చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కానీ వీడియోలు, ఫోటోస్, మెసేజ్ లు వాట్సప్ గ్రూప్ ల్లో పోస్ట్ చేస్తే.. పోస్టు చేసిన వ్యక్తితో పాటు గ్రూప్ అడ్మిన్ ల మీద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని వాట్సాప్ గ్రూపులపైన పోలీసుల ప్రత్యేక నిఘా ఉంచామని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments