స్పాట్ వాయిస్, ములుగు: తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా అధ్యక్షుడు పత్తిపాకరాములు మల్లంపల్లి మండలం బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడిగా మాచర్ల రవి (క్లాసిక్) ని నియమించారు. ఈ మేరకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. బీసీ వర్గానికి మండలంలో తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా ఆవుల రమేష్ యదవ్(రామచంద్రపురం), ఉపాధ్యక్షుడిగా తిప్పారపు కిషన్, (మహమ్మద్ గౌస్ పల్లి) ప్రధాన కార్యదర్శి బజ్జిశ్రీనివాస్, (దేవనగర్) కోశాధికారి మురారి శ్రీనివాస్, (భూపాల నగర్) గౌరవ అధ్యక్షుడిగా గువ్వలనాగరాజు (కోడిసెలకుంట), ముఖ్య సలహాదారుడుగా పరికిపండ్ల సదానంద, మల్లంపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
బీసీ సంక్షేమ సంఘం మల్లంపల్లి మండల అధ్యక్షుడిగా రవి(క్లాసిక్)
RELATED ARTICLES
Recent Comments