Sunday, February 2, 2025
Homeతెలంగాణతేలిన బీసీ లెక్క..

తేలిన బీసీ లెక్క..

తేలిన బీసీ లెక్క..

ఎవరు ఎంత శాతం అంటే…

వెల్లడైన సర్వే వివరాలు…

స్పాట్ వాయిస్, బ్యూరో : రాష్ట్రంలో కులగణన లెక్క వెల్లడైంది. ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై రూపొందించిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేశారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై నివేదికపై చర్చించిన అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనేదే తమ ఆకాంక్ష అని మంత్రి చెప్పారు.

96.9 శాతం సర్వే..

రాష్ట్రంలోని 96.9 శాతం మంది అంటే 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొని తమ వివరాలను అందించారని మంత్రి తెలిపారు. 3.1 శాతం మంది అంటే 16 లక్షల మంది వివిధ కారణాల వల్ల తమ వివరాలను అందించలేదని అన్నారు. రాష్ట్ర మొత్తం జనాభా 3.70 కోట్లని చెప్పారు. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందని, అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తిచేశారని తెలిపారు.

*సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.43 శాతం, ఎస్టీ జనాభా 10.45 శాతం, బీసీ జనాభా 46.25 శాతం.

*ముస్లిం మైనారిటీల్లో బీసీ జనాభా 10.08 శాతం. ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం.

*రాష్ట్రంలో ఓసీ జనాభా 15.79 శాతం. ముస్లిం మైనారిటీల్లో ఓసీ జనాభా 2.48 శాతం.

*రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీ జనాభా 12.56 శాతం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments