చర్చలు సఫలం..
ఆందోళన విరమించిన బాసర విద్యార్థులు..
స్పాట్ వాయిస్ , బాసర : వారం రోజుల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన నిరసనకు తెరపడింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ విద్యార్థులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 15 రోజుల్లో మరోసారి క్యాంపస్ కు వస్తానని చెప్పారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా చర్చలు జరిగాయి. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలతో పాటు మౌలిక వసతుల సౌకర్యం, రెగ్యులర్ వీసీ నియామకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. చర్చల్లో ట్రిపుల్ ఐటీ ఇన్ చార్జీ వీసీ రాహుల్ బొజ్జా, డైరెక్టర్, నిర్మల్ కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.
Recent Comments