మద్యం తాగించి..
రోకలి బండతో కొట్టిచంపాడు..
కాళ్లు చేతులు కటేసి.. గోనే సంచిలో కుక్కేశాడు..
కారులో డెడ్ బాడీతో సిటీ అంతా తిరిగాడు..
వీడిన బ్యాంకు ఉద్యోగి హత్య మిస్టరీ
డబ్బులో కోసమే హత్య..
యూట్యూబ్ జర్నలిస్టు ఘాతుకం..
గతంలోనూ పలువురిని బెదిరించిన నిందితుడు
స్పాట్ వాయిస్, వరంగల్ క్రైం: రూ.5లక్షలు కావాలన్నాడు.. వీలు కాదని చెప్పడంతో ఫుల్ తాగించి.. రోకలి బండతో కొట్టాడు. ఒంటిపై ఉన్న బంగారు బ్రాస్ లెట్, గోలుసు, మూడు ఉంగరాలు తీసుకున్నాడు. మృతుడిని దండెం తాడుతో కట్టేసి తువ్వాలతో అరవకుండా గొంతుకు కటేశాడు. కాళ్లు కొట్టుకుంటుంటే పాత కుక్క గొలుసుతో కాళ్లు కట్టివేసి దానికి తాళం వేసి గోనెసంచిలోకి కుక్కాడు. ఇది ఐదు రోజుల క్రితం బ్యాంకు బ్యాంకు ఉద్యోగి హత్య జరిగిన తీరు. నిందితుడు జక్కుల శ్రీనివాసరావు ములుగు జిల్లా, మంగపేట మండలం, కోమటిపల్లి గ్రామం. ఇతను గతంలో యూట్యూబ్ జర్నలిస్టుగా పనిచేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన వివరాలను ఏసీపీ నందిరాం, డీసీపీ ఏక్ సలిమా, మట్టెవాడ సీఐ తుమ్మ గోపి వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు శ్రీనివాసరావు ప్రగతి నగర్, రెవెన్యూ కాలనీలో కిరాయికి ఉంటూ కోమటిపల్లికి చెందిన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఒక మొబైల్ ఫోన్ దొరకడంతో ఆ ఫోన్ ఇచ్చే క్రమంలో మృతుడు బ్యాంకు ఉద్యోగి వెలిగేటి రాజమోహన్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో రాజమోహన్ తనకు ఇద్దరు ఆడపిల్లలని, ఒకరు యూఎస్ఏలో, ఇంకొకరు హైదరాబాదులో ఉంటున్నారని చెప్పారు. భార్య చనిపోయినదని, ప్రస్తుతం ఒక్కడే నివసిస్తున్నాడని, ఎవరైనా వీడో ఉంటే పెళ్లి చేసుకుంటానని నిందితుడికి చెప్పాడు. దీన్ని ఆసరాగా తీసుకొని నిందితుడు తన బిజినెస్ కు రూ. 5 లక్షలు అవసరం ఉందని మృతుడని అడిగాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి రెండు నెలలుగా క్రమం తప్పకుండా బార్లలో కూర్చొని మందు తాగడం పరిపాటిగా మారింది.

కారులో మృతదేహంతో..
నిందితుడు మృతుడిని డబ్బుల గురించి ఒత్తిడి చేయడంతో, మృతుడు ప్రస్తుతం తన దగ్గర లేవని చెప్పాడు. దీంతో రాజమోహన్ రావు ఒంటిమీద ఉన్న బంగారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనలో పడ్డాడు. పథకం ప్రకారంగా ఈనెల 2వ తేదీన రాత్రి తాగుదాం అని చెప్పి మృతుడిని నమ్మించి రెవెన్యూ కాలనీ, ప్రగతి నగర్ లోని తన ఇంటికి రాత్రి పిలిపించుకున్నాడు. అక్కడ మృతుడికి ఫుల్ గా మద్యం తాగించిన తర్వాత రోకలి బండతో మృతిడి తలపై విచక్షణారహితంగా కొట్టాడు. ఒంటిపై ఉన్న బంగారు బ్రాస్ లెట్, గోలుసు, మూడు ఉంగరాలు తీసుకున్నాడు. మృతుడిని దండం తాడుతో కట్టివేసి తువ్వాలతో అరవకుండా గొంతుకు కట్టేశాడు. కాళ్లు కొట్టుకోవడాన్ని గమనించి కుక్క గొలుసుతో కాళ్లు కట్టివేసి దానికి తాళం వేసి గోనెసంచిలో కుక్కాడు. బ్యాంకు ఉద్యోగి తన వెంట తీసుకొని వచ్చిన కారు వెనక సీటులో గోనె సంచి వేసుకొని శివారులో ఎక్కడైనా పడేయాలనే ఆలోచనతో వడ్డేపల్లి రోడ్డు నుంచి, కేయూసీ జంక్షన్ ద్వారా డబ్బాలు నుంచి రెడ్డి పురం చెరువులోకి వెళ్లే రోడ్డులోకి వెళ్లాడు. మృతదేహాన్ని పడవేద్దామని అనుకోగా అటువైపు జనసంచారం ఉండడంతో మళ్లీ కారుని నడుపుకుంటూ కెనాల్ లో పడేదద్దామని వెళ్లి పక్కన మట్టి రోడ్డు నుంచి ములుగు రోడ్డుకి వచ్చాడు. ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం జంక్షన్ దాటి, జీడబ్ల్యూఎంసీ పక్కన గల పెట్రోల్ బంకు నుంచి భద్రకాళి గుడి దాటి రంగంపేట ఏరియాకి వచ్చాడు. అక్కడ ఎలాంటి జనసంచారం లేకపోవడంతో రోడ్డు పక్కన కారును ఆపి వెళ్లాడు. మృతుడికి సంబంధించిన చెప్పులను అక్కడి ఒక ఇంటి దగ్గర్లో వదిలిపెట్టాడు. అక్కడి నుంచి రోడ్డుకు నడుచుకుంటూ వచ్చి ఒక ఆటోలో వెళ్లిపోయాడు. ఇంటిదగ్గర ఎలాంటి ఆధారాలు దొరకకుండా అన్నింటినీ కడిగేసి వెనుక తుప్పల్లో వేశాడు. మృతుడికి సంబందించిన మొబైల్ పోను కూడా ఇంటిలో దాచేశాడు.
మృతుడు..
1000 సీసీ కెమెరాల పరిశీలన..
ఘటన స్థలం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో వరంగల్ ఏసీపీ నందిరాం ఆధ్వర్యంలో వరంగల్ సబ్ డివిజన్లోని క్రైమ్ పార్టీ, ఆఫీసర్లు లను నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి సుమారు 1000 సీసీ కెమెరాలు పరిశీలించారు. నిందితుడు ప్రయాణించిన ఆటోని తెలుసుకొని వరంగల్ నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. వారి ద్వారా నిందితుడికి సంబంధించిన ఇంటిని తెలుసుకొని నిందితుడు పట్టుకొని అతని వద్ద నుంచి మృతుడికి సంబంధించిన సెల్ ఫోన్, సుమారు నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలైన బ్రాస్ లెట్, చైన్, మూడు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. రోకలి బండ, మృతుడి రక్తంతో తడిచి ఉన్న షర్టు, రక్తపు మరకలతో ఉన్న నేరస్తుడు షర్టును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ములుగు జిల్లా, మంగపేట మండలం, కోమటిపల్లి గ్రామానికి చెందిన జక్కుల శ్రీనివాసరావు. ఇతను గతంలో యూట్యూబ్ జర్నలిస్టుగా పనిచేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు వివరించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మట్టెవాడ సీఐ తుమ్మ గోపి, సబ్ ఇన్ స్పెక్టర్ విట్టల్, నవీన్, సాంబయ్య, లచ్చయ్య, సబ్ డివిజన్ కు సంబంధించిన క్రైమ్ పార్టీ సిబ్బందిని ఎసీపీ నందిరాం, డీసీపీ ఏక్ సలీమా, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ అభినందిచారు.
Recent Comments