Wednesday, January 29, 2025
Homeతెలంగాణలాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకోండి..

లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకోండి..

లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకోండి..

రాష్ట్రం ఖర్చు చేసే పథకాలకు ఏ పేరైనా పెట్టుకోవచ్చు..

రేషన్ బియ్యం కేంద్రమే కదా ఇచ్చేది.. 

గరీబ్ కళ్యాణ్ యోజన అని పెడితే తప్పేంది..?

రాష్ట్ర సర్కార్ పై కేంద్ర మంత్రి బండి ఫైర్

స్పాట్ వాయిస్, బ్యూరో: కేంద్రమంత్రి బండి సంజయ్ తగ్గేదేలేదు అన్నట్టుగా కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నాడు. ఇటీవల ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుపై సీఎం ఫొటో ఉంటే ఒక్క రూపాయి ఇవ్వమంటూ వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తాజాగా మారోసారి అదే విషయమై స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందన్నారు. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ తాము అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోందో కదా… గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫఒటో ఎందుకు పెట్టరు అని ప్రశ్నించారు.

మీ ఖర్చు.. మీ పేరు..  

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాంగ్రెస్‌కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేనేలేదన్నారు.

చీటింగ్..

మండలానికి ఒక గ్రామంలోనే నాలుగు పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేటని బండి సంజయ్ ప్రశ్నించారు. మిగిలిన గ్రామాల ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేయలేదా? రాష్ట్ర ప్రజలకు ఇంత దుర్మార్గంగా చీటింగ్ చేస్తారా? రాష్ట్ర ప్రజలందరికీ లబ్ది చేకూరుస్తామని చెప్పి మండలానికి ఒక గ్రామానికి లబ్ది చేకూర్చడం నీచమంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతల జేబుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారా? లేక పాకిస్తాన్..బంగ్లాదేశ్ నుంచి తెచ్చి ఖర్చు చేస్తున్నారా? ప్రజలు కట్టిన పన్నులతోనే కేంద్రమైనా, రాష్ట్రమైనా ఖర్చు చేస్తోంది కదా..? గతంలో పీఎం ఆవాస్ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే… కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేశాడని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments