బండి ఎక్కువ మాట్లాడొద్దు..
రాష్ట్రానికి నిధులు ఎట్లా రావో చూద్దాం..
బండి సంజయ్‌కు పొన్నం వార్నింగ్
స్పాట్ వాయిస్, బ్యూరో : మాజీ ప్రధాని ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం వాటాతో నిర్మించిన ఇళ్లను ‘ఇందిరమ్మ ఇళ్లు’ గా ప్రజలకు పంపిణీ చేస్తే ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వమని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు. రాష్ట్రానికి బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. సంక్షేమ పథకాలకు డబ్బులు ఎలా ఇవ్వరో మేము చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన హోదా లో వుండి సంజయ్ మాటలు సరికాదని స్పష్టం చేశారు.
Recent Comments