‘బలగం మొగిలయ్య’ మృతి..
స్పాట్ వాయిస్, వరంగల్ :బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య స్వర్గస్తులయ్యారు. నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన ఆయన గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు.కొన్నాళ్లుగా ఇంటి వద్ద వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మృతి చెందాడు. కాగా, జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అందరినీ ఏడిపించిన విషయం తెలిసిందే. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు పాడిన ఈ పాట తెలంగాణ ప్రజలను కన్నీళ్లు పెట్టించింది.
Recent Comments