బాలవికాస సేవలు అభినందనీయం
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్ర నాయక్
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ లో అనాథ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని పిల్లలతో కేక్ కట్ చేపించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని పిల్లలను చేరదీసి వారి బాగోగులను చూస్తూ ప్రయోజకులను చేస్తున్న తీరు గొప్పద్దన్నారు. తన వంతుగా సహాయంగా రు.5 వేలు పిల్లలకు సహయార్థం విరాళంగా ఇస్తున్నానాని నగదు అందజేశారు. ప్రోగ్రాం మేనేజర్ లతాప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. బాలవికాస సంస్థ దాతల సహాయంతో అనాథ పిల్లలను,వృద్ధులను చేరదీసి వారి బాగోగులను చూడటంతో పాటు 6500 గ్రామాల్లో త్రాగునీరు, విద్య, వైద్యం, పారిశుధ్యం, సేంద్రియ వ్యవసాయం, వితంతు వివక్షత నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలను చేపట్టి గ్రామాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బట్టు నాయక్, సాధు లింగారెడ్డి,కొమ్మినేని సతీష్,మార్త నాగార్జున,తండా రాములు, కారుపోతుల అనిల్,కాంతారావు,దయాకర్, వెంకటేశ్వర్లు,సంస్థ ప్రతినిధులు జ్యోతి, రమ,కందునూరి సుకన్య,మార్గం శోభ,స్వర్ణలత,స్వరూప,యాకలక్ష్మి,అహల్య,వెంకటరత్నం, ఉపేంద్ర,చాంద్ బీ,నరేష్,నాగేష్, వికాస పిల్లలు, మహిళలు పాల్గొన్నారు.
Recent Comments