భద్రాచలం లో మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక..
ఉగ్రరూపం దాల్చిన గోదావరి..
స్పాట్ వాయిస్ , భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం 54.3 అడుగులకు చేరుకుంది. మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 14,92,679 క్యూసెక్కుల వరద పరుగులు తీస్తోంది.. కాగా, గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని పలు మండలాలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాలకు వెళ్లేప్రధాన రహదారిపై నెల్లిపాక వద్ద వరద నీరుచేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
భద్రాచలంలో మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక..
RELATED ARTICLES
Recent Comments