Saturday, April 5, 2025
Homeజాతీయంరెండు తలలు, మూడు చేతులు

రెండు తలలు, మూడు చేతులు

వింత శిశువు జననం..
స్పాట్ వాయిస్, డెస్క్: మధ్యప్రదేశ్ రత్లాం జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. అతనికి రెండు తలలు, మూడు చేతులు ఉండటం చూసి వైద్యులు, కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. దీంతో చిన్నారిని ఇండోర్​లోని ఎంవై ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడి వైద్య నిపుణులు పసికందును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందంతో పర్యవేక్షిస్తున్నారు. పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన గర్భిణికి వైద్యులు ఆపరేషన్ చేశారు. తీరా బిడ్డను చూశాక ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. అతనికి రెండు తలలు ఉండటమే గాక మూడు చేతులు ఉన్నాయి. అయితే డెలివరీకి ముందు తీసిన సోనోగ్రఫీ రిపోర్టులో మహిళ కడుపులో కవలలు ఉన్నట్లు తెలిసిందని, కానీ తీరా ప్రసవం అయ్యాక చూస్తే ఒకే శిశువుకు రెండు తలలు ఉన్నాయని వైద్యుల తెలిపారు. రెండు చేతులు సాధారణంగానే ఉండగా.. మూడో చెయ్యి రెండు తలల మధ్య నుంచి ఉన్నట్లు పేర్కొన్నారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని పాలీసెఫాలీ కండీషన్ అంటారని, అతికొద్ది మంది చిన్నారుల్లోనే ఇలా అత్యంత అరుదుగా జరుగుతుందని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments