Thursday, April 17, 2025
Homeటాప్ స్టోరీస్అజార హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి

అజార హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి

అజార హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి

వైద్యుల నిర్లక్ష్యం వల్లే మచ్చాపూర్ గ్రామ ఉపసర్పంచ్ అప్పని కర్ణాకర్ మృతి..

బాధిత కుటుంబానికి రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి..

కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకటరామిరెడ్డి

స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: వరంగల్ జిల్లా గీసు గొండ మండలం లోని మచ్చాపూర్ గ్రామ ఉపసర్పంచ్ అప్పని కర్ణాకర్ ఛాతీలో నొప్పితో బాధ పడుతూ ములుగు రోడ్డు సమీపంలోని అజార హాస్పిటల్ శనివారం ఉదయం అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతున్న కర్ణాకర్ మృతి చెందాడు. అయితే తగిన సమయంలో వైద్యం అందించకపోవడం తోనే మరణించాడని, అజర హస్పిటల్ యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. ఇది ఇలా ఉంటే ఉపసర్పంచ్ మరణ వార్త తెలుసుకున్న తక్షణమే మృతుని బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments