Saturday, April 19, 2025
Homeలేటెస్ట్ న్యూస్నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు

నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
స్పాట్ వాయిస్, బ్యూరో: సినిమా రంగాల్లోని వారికి ఇచ్చే నంది అవార్డుల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. గద్దర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం.. ఈ విషయాన్ని వెల్లడించారు. చాలామంది సినీ ప్రముఖులతో అవార్డుల గురించి చర్చించానని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రభుత్వం తరఫున గద్దర్‌ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గద్దర్‌ జయంతి రోజు ఈ అవార్డులను ప్రదానం చేస్తానని పేర్కొన్నారు. గద్దర్‌ అవార్డులపై త్వరలోనే జీవో జారీ చేస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments