Friday, November 22, 2024
Homeక్రీడలుఅప్పాజోస్యులకు అనంతలక్ష్మీకాంత సాహితీ పురస్కారం 

అప్పాజోస్యులకు అనంతలక్ష్మీకాంత సాహితీ పురస్కారం 

అప్పాజోస్యులకు అనంతలక్ష్మీకాంత సాహితీ పురస్కారం 

స్పాట్ వాయిస్, కల్చరల్ : సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, అనంత లక్ష్మీకాంతం శారదా పీఠం హైదరాబాదు సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సుబేదారిలోని‌ పీఆర్ రెడ్డి భవన్ లో కీ.శే. రేవూరి లక్ష్మీకాంతం రావు శతజయంతి సభను ఘనంగా ‌నిర్వహించారు. సంస్థ ఆధ్యక్షుడు గిరిజామనోహరబాబు సభాధ్యక్షతన, కార్యదర్శి కుందావఝల కృష్ణమూర్తి స్వాగతం వచనం, ఆచార్య బన్నా అయిలయ్య జ్యోతి ప్రకాశంతో సభ ప్రారంభం అయింది. కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు డీఎస్ ఎన్ మూర్తి, అనంత లక్ష్మికాంత సాహితీ పురస్కార గ్రహీత‌ అభోవిభో అధ్యక్షుడు అప్పాజోస్యుల సత్యనారాయణ పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని, బహుముఖీయ ప్రజ్ఞను ఆవిష్కరించారు. పురస్కార ప్రదాత ప్రసార భారతి న్యూఢిల్లీ విశ్రాంత అదనపు ‌డైరెక్టర్ డాక్టర్ రేవూరి‌ పద్మనాభరావు అవార్డు పూర్వాపరాలు వివరించారు. అనంతరం అప్పాజోస్యుల సత్యనారాయణ గారికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇంతకు ముందు ఈ పురస్కారం పొందిన వారిలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ, ఎస్వీ బాలసుబ్రమణ్యం, ధారా రామనాథ శాస్త్రి, కేవీ రమణాచారి తదితర ప్రముఖులను ఘనంగా రూ.25 వేల నగదు తో సత్కరిస్తున్నామని తెలిపారు. సంస్థ బాధ్యులు వనం లక్ష్మీకాంతరావు, డాక్టర్ ఎన్ వీఎన్ చారి, మల్యాల మనోహరరావు, పాలకొండ భాస్కర్ రావు, జూలూరి నాగరాజు, కళా రాజేశ్వరరావు, అంపశయ్య నవీన్, పొట్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ గుంజి‌ వెంకటరత్నం, శ్రీనివాసమూర్తి, మురళీధర్, దినకర్, శ్రీ రామోజు సుందరమూర్తి, తదితర సాహితీ వేత్తలు కవులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments