Saturday, April 5, 2025
Homeసినిమాసినీ నటుడు మహేశ్ బాబు ఇంట్లో చోరీకి యత్నం

సినీ నటుడు మహేశ్ బాబు ఇంట్లో చోరీకి యత్నం

30 అడుగుల గోడపై నుంచి దూకిన దుండగుడు
తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: సినీ నటుడు మహేశ్‌బాబు నివాస ప్రాంగణంలోకి మంగళవారం రాత్రి ఓ ఆగంతుకుడు దూకాడు. ఎత్తయిన గోడపై నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని కాపలాదారులు గమనించి అదుపులోకి తీసుకొన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.81లో మహేష్‌బాబు నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివాస ప్రాంగణంలో ప్రహరీ పక్కగా పెద్ద శబ్దం వచ్చింది. కాపలాదారులు వెళ్లి చూడగా.. ఓ వ్యక్తి గాయాలపాలై కనిపించాడు. వెంటనే అతన్ని పట్టుకొని విచారించడంతోపాటు జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. మూడు రోజుల కిందట ఒడిశా నుంచి వచ్చినట్లు గుర్తించారు. సమీపంలోని నర్సరీ వద్ద ఉంటున్నాడు. చోరీకని వచ్చి 30 అడుగుల గోడ పైనుంచి దూకాడు. నిందితుడిని కృష్ణ(30)గా గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో మహేష్‌బాబు నివాసంలో లేరు. కాపలాదారుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments