పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
పోలీసులకు అప్పగింత..
పోక్సో చట్టం కింద కేసు నమోదు
స్పాట్ వాయిస్, గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్దివంచ గ్రామ శివారులోని కొత్తతండాలో రెండున్నరేళ్ల పాపపై అదే తండాకు చెందిన అశోక్ లైంగికదాడికి యత్నించాడు. దీంతో స్థానికులు అశోక్ ను బంధించి కరెంట్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం గార్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో విచారణ జరిపి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు గార్ల ఎస్సై వెంకన్న తెలిపారు. కాగా, పాప కుటుంబాన్ని ఐద్వా నాయకురాలు కందునూరి కవిత పరామర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడాలనే ఆలోచన రాకుండా కఠినంగా శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. తండాలో ఘర్షణలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Recent Comments