తనిఖీల్లో దొరికింది రూ.28 లక్షలే..
నాపై ఐటీ రైడ్స్ రాష్ర్టంలోనే చరిత్ర
మంత్రి మల్లారెడ్డి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఐటీ అధికారుల రైడ్స్ తనకు కొత్తేమీ కాదని, మూడు రోజులుగా చేస్తున్న తనిఖీల్లో తమ దగ్గర దొరికింది రూ.28 లక్షలేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్ కమ్ ఉంటేనే కదా? ట్యాక్స్ కట్టేదని వ్యాఖ్యానించారు. తమ మీద జరిగిన రైడ్ తెలంగాణ రాష్ట్రంలోనే చరిత్ర అని అన్నారు. రైడ్స్ తనకు కొత్త కాదని..తనకు రూల్స్ అన్నీ తెలుసని అన్నారు. బీజేపీ కేంద్ర బలగాలతో దౌర్జన్యం చేస్తోందని ఆరోపించారు. తనపై రైడ్స్ కోసం ఐటీ అధికారులు 200 వాహనాలను బుక్ చేసుకున్నారని అన్నారు. తనను బద్నాం చేయడానికే ఈ రైడ్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇంత దౌర్జన్యం తాను ఇంత వరకు చూడలేదన్నారు. తాము సేవ చేస్తున్నాం కానీ.. బిజినెస్ కాదన్నారు. ఐటీ అధికారులు తమను నమ్మించి మోసం చేశారని మల్లారెడ్డి అన్నారు. తమ కొడుకును మెంటల్ టార్చర్ పెట్టారని ఆరోపించారు. వంద కోట్లు దొరికినట్లు ఐసీయూలో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సైన్ చేసుకున్నారని ఆరోపించారు. కొడుకు హాస్పిటల్‌లో ఉంటే చూడనివ్వరా? అని ప్రశ్నించారు. ల్యాప్ టాప్ ను ఐటీ అధికారులు మర్చిపోతే తామే ఇచ్చామన్నారు. తాము ఎలాంటి ల్యాప్ టాప్ తీసుకెళ్లలేదన్నారు. తమ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులంతా పేద విద్యార్థులేనన్నారు. ఫీజులన్నీ ఆన్ లోన్ లోనే కడుతున్నారని.. ఇంకా దాచుకునేదేం ఉందన్నారు. కేసీఆర్ తనకు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పారని..ఆ ధైర్యంతోనే ఇప్పుడు మాట్లాడుతున్నానిన అన్నారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదన్నారు. కేవలం టీఆర్ఎస్ మంత్రిననే తనపై రైడ్స్ చేస్తున్నారని అన్నారు. ఎంత దోచుకున్నామో చెబితే తామే ఒప్పుకుంటామని.. ట్యాక్స్ కడుతామని చెప్పారు.
దాడులు కొత్తేమీ కాదు..
RELATED ARTICLES
Recent Comments