కేసు నమోదు చేసిన పోలీసులు
స్పాట్ వాయిస్, మానుకోట: మహబూబాబాద్ తహసీల్దార్‌పై గిరిజన రైతులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సలార్ తండా సమీపంలో కోర్టు నిర్మాణ స్థల పరిశీలనకు ఆదివారం అధికారులతో పాటు తహసీల్దార్ ఇమాన్యూయల్ వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే గిరిజన రైతులు తాహసీల్దార్ ఇమ్మానుయేల్ తో వాగ్వాదానికి దిగి.. రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో తహీసల్దార్ గాయపడ్డాడు. వెంటనే అంతడిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడి చేసిన గిరిజన రైతులపై మహబూబాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Recent Comments