మూడు గ్రూపుల వర్గీకరణ
సానుకూలంగా స్పందించిన అన్ని పార్టీల సభ్యులు
స్పాట్ వాయిస్, బ్యూరో: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఎస్సీ కేటగిరికి చెందిన ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఇక 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గ్రూప్-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు ఒక శాతం రిజర్వేషన్, మాదిగలున్న గ్రూప్-2లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్లు, మాలలు ఉన్న గ్రూప్-3లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని అన్నారు. వెంటనే ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించామని, మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు షమీమ్ అక్తర్ కమిషన్ నియమించామని, కమిషన్ ప్రజల నుంచి 8,681 ప్రతిపాదనలు స్వీకరించిందని వివరించారు. కమిషన్ నివేదికను ఏ మాత్రం మార్చకుండా ఆమోదించామని, 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా కమిషన్ విభజించిందని, 59 కులాలు ఇప్పటివరకు పొందిన ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫార్సులు చేసిందని వివరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం..
RELATED ARTICLES
Recent Comments