నెలాఖరులోగా ఆర్వోఆర్…
ధరణి ప్లేస్ లో కొత్తం చట్టం
స్పాట్ వాయిస్, బ్యూరో: రేవంత్ రెడ్డి సర్కార్.. మరో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెబుతున్న సర్కార్ ఆదిశగా అడుగులు వేస్తోంది. తాజాగా.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి ఆర్వోఆర్ (ROR) చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. కొత్త చట్టాన్ని ఈ నెలాఖరులోగా అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణలో త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు కొత్త ఆర్వోఆర్ చట్టం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించినట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే.. గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్యలో కూర్చొని ధరణి పోర్టల్‌ను సిద్ధం చేసినట్టుగా కాకుండా.. ఈ కొత్త చట్టం రూపకల్పన విషయంలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని పొంగులేటి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇప్పటికే చాలా భూసమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి వివరించారు. కొత్త చట్టం తీసుకొచ్చి.. అందరి భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను గాలికి వదిలేసిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను దసరాలోపు పేద ప్రజలకు అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4 వేల ఇండ్లు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల సలహాలు, సూచనలు కూడా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Recent Comments