ఎర్రబెల్లి వాహనం అడ్డగింత
పెంబర్తి వద్ద ఉద్రిక్తత
అరూరితో ఫోన్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
స్పాట్ వాయిస్, బ్యూరో: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి కేంద్రంగా బుధవారం ఉదయం నుంచి హైడ్రామా కొనసాగుతోంది.బీజేపీలో చేరిక విషయమై ఆయన ఉదయం హన్మకొండలోని ఆయన నివాసంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా, ప్రారంభానికి ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తోపాటు నాగుర్ల వెంకన్న, సుందర్ రాజు తదితరులు అరూరి రమేష్ నివాసానికి చేరుకుని, ఎర్రబెల్లి వాహనంలో ఎక్కించుకుని, హైదరాబాద్ వైపునకు బయలు దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జై శ్రీరామ్, జై బీజేపీ నినాదాలు చేస్తూ వాహనంలో కూర్చున్న అరూరి రమేశ్ ను వాహనంలో నుంచి కిందకు దించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట వాహనంలో హైదరాబాద్ కు వెళ్లొద్దని, బీజేపీలో చేరాలంటూ ఆరూరి రమేష్ ను కోరారు. బీఆర్ ఎస్ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు జరిగిన ఈ తోపులాటలో అరూరి రమేష్ చొక్కా చిరిగిపోయింది. కిందికి దిగిన ఆరూరిని పోన్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడించారు.
Recent Comments