- కంటికి రెప్పలా కాపాడుకుంటాం
ఎమ్మెల్యే అరూరి…
స్పాట్ వాయిస్ హన్మకొండ రూరల్: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎంపీ పసునూరి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్దన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొమ్మగాని స్వామి రాయుడు, వైస్ చైర్మన్ గా గట్టు నరసింహ చార్యులు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా అవకాశాలు వస్తాయని అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రి దయాకర్ రావు పెద్ద మనసుతో పార్టీ పదవులలో, నామినేటెడ్ పదవులలో వర్ధన్నపేట నియోజకవర్గానికి ఎక్కువ అవకాశాలు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మార్కెట్ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. వర్ధన్నపేట మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని పాలకవర్గానికి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ వ్యవస్థ బలోపేతం అయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే అన్నం పెట్టె ధాన్యగారంగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు,వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి,హన్మకొండ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments