ఆరుద్ర.. ఆగమనం
ఎర్రని పట్టువస్త్రాన్ని కప్పుకున్నట్లుగా చూడముచ్చటగా కనిపించే ఈ కీటకాలు ఏడాదిలో కేవలం ఆరుద్రకార్తె ఆగమనంలోనే దర్శనమిస్తాయి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చే ఆరుద్ర పురుగులు అన్నదాతలు అత్యంత శుభ సూచకంగా భావిస్తారు. బుధవారం గణపురం శివారులోని చేన్లలో ‘ఆరుద్ర’ పురుగులు గుంపులు గుంపులుగా కనిపించి కనువిందు చేశాయి. దీంతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి.
–స్పాట్ వాయిస్, గణపురం
Recent Comments