క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది అరెస్ట్
తొమ్మిది మంది అరెస్ట్ , పరారీలో నలుగురు
స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపూర్): ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న13 మందిపై కేసు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఖానాపూర్ ఎస్సై తిరుపతి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలం లోని బుధరావుపేటకు చెందిన కొందరు గ్రామంలోని ఓ దుకాణం వద్ద మంగళవారం జరుగుతున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశా రు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని విచారించగా ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన జక్కి శ్రీని వాస్, పసునూరి వెంకటేశ్వర్లు, పసునూరి రమేష్, బానో తు హీరాలాల్, పసునూరి భరత్, గారె రవికుమార్, జ టంగి అశోక్, మారిపెద్ది కార్తీక్, పసునూరి తరుణ్ ను అరెస్ట్ చేయగా వీరితో పాటు గ్రామానికి చెందిన మరో నలుగురు బత్తిని శివ, నందగిరి ప్రభాకర్, ఎస్ కే ఫాజిల్, ఎస్ కే ఆఫ్జల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 13 మందిపై కేసు నమోదు చేసి వారి నుంచి రూ.27 వేల నగదు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, మరో నలుగురిని త్వరలో పట్టుకుంటామని ఎస్సై తిరుపతి తెలిపారు.
Recent Comments