Friday, November 15, 2024
Homeలేటెస్ట్ న్యూస్గ్రేటర్ వరంగల్ లో కలకలం..

గ్రేటర్ వరంగల్ లో కలకలం..

మరో కార్పొరేటర్ అరెస్ట్..
పరకాల సబ్ జైలుకు తరలింపు
స్పాట్ వాయిస్, కాజీపేట: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 62వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ జక్కుల‌ రవీందర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించ‌గా, పరకాల స‌బ్ జైలుకు తరలించారు. కాజీపేట సోమిరెడ్డి ప్రాంతంలో ఐదు గుంటల భూమి ఆక్రమ‌ణ‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ జక్కుల రవీందర్‌పై ఇటీవ‌ల మడికొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన పోలీసులు, రెవెన్యూ అధికారులు కార్పొరేటర్ భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. దీంతో ఆయ‌న‌పై కేసు నమోదు చేశారు. కొద్ది రోజులుగా ప‌రారీలో ఉన్న ర‌వీంద‌ర్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుపర్చారు. దీంతో న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments