Thursday, May 29, 2025
Homeతెలంగాణగండ్ర హౌజ్ అరెస్టు..

గండ్ర హౌజ్ అరెస్టు..

గండ్ర హౌజ్ అరెస్టు

హన్మకొండలోని జీఎస్సార్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

ఎమ్మెల్యే గండ్ర అవినీతిపై ఆధారాలతో సహా రెడీ ఉన్నానని స్పష్టం. ముందుస్తుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల అరెస్టు

స్పాట్ వాయిస్, హన్మకొండ: భూపాలపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. గురువారం ఉదయమే హన్మకొండ. నక్కల గుట్టలోని ఆయన నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్భందం చేశారు. అయితే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర అవినీతి, అక్రమాలను నిరూపించేందుకు ఆధారాలతో సహా తాను సిద్ధంగా ఉన్నానని జీఎస్సార్ మీడియాతో స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఫ్లెక్సీల వార్ మొదలైంది. ఆ తరువాత రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ పై బీఆర్ ఎస్ శ్రేణులు రాళ్లదాడి కి పాల్పడ్డారు. ఇరువర్గాల పరస్పర దాడులు, ఎమ్మెల్యే గండ్ర, కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఎస్పీ  భూపాలపల్లి లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఉదయం నుంచే బీఆర్ ఎస్, కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. మొత్తం మీద భూపాలపల్లి లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments