Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..

ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..

ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..
ఎమ్మెల్యే అరూరి రమేష్
ఐనవోలులో సురక్ష దినోత్సవం

స్పాట్ వాయిస్, ఐనవోలు : తెలంగాణలో ప్రజల భద్రతే ప్రధాన కర్తవ్యంగా పోలీస్ వ్యవస్థ కృషి చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఆదివారం ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున ఫక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో చేపట్టిన సురక్ష దినోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి పోలీస్ వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉన్నత ఆలోచనలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకువచ్చి ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్ క్రైమ్ వంటి సాంకేతికతో ముడిపడి ఉన్న నేరాల వంటి సవాళ్లను సైతం ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధమై ఉందన్నారు. మహిళల భద్రత విషయంలోనూ పటిష్ట కార్యాచరణను అమలు చేస్తూ, వారిని వేధింపులకు గురి చేసే ఆకతాయిల భరతం పట్టేందుకు షీ టీంలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయి భద్రతను కల్పించిందన్నారు పోలీస్ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పటిష్ట నిర్ణయాల వల్ల అరాచక శక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ పోలీసులు ఉన్నారని తెలిపారు. దేశంలోనే అంతర్జాతీయ ప్రమాణలతో హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా సాంకేతికంగా పోలీసులకు సక్లిష్టమైన కేసులను సైతం పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలో పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టడం వల్లే నేడు రాష్ట్ర భద్రత అద్భుతంగా ఉందని తెలిపారు. గత 7 సంవత్సరాల్లో పోలీస్ శాఖలో 28,277ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా అదనంగా 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, ట్రైనీ ఐపీఎస్ అంకిత్, అడిషనల్ డీసీపీ సంజీవ్, మామునుర్ ఏసీపీ కృపాకర్, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments