Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఆసన్నా.. నీ మాటెప్పుడూ యాసేనా..?

ఆసన్నా.. నీ మాటెప్పుడూ యాసేనా..?

మళ్లీ నోరు జారిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
సిరికొండను చిన్నబుచ్చారని అభిమానుల ఫైర్
గవర్నర్ రబ్బర్ స్టాంప్ అనడంపై కమల దళం ఆగ్రహం
స్పాట్ వాయిస్, గణపురం: అయ్యా.. ఆసన్నా.., ఏందయ్యా ఇది. ‘జీవం’ లేని మాటలతో గత్తర లేపుతూ, జనాలను కూడా ఆగం జెయ్యవడ్తివి. నీ మాటెప్పుడూ అంతేనా..? నోటి నుంచి జారిన మాటను వాపస్ తీసుకోవడం అంటే షోరూంకు పోయి కోట్లు పోసి కొత్తకారు కొన్నంత వీజీ అనుకుంటివా.. టీవీ చర్చల్లో నువ్వు కనిపించుడేమోగానీ, సోషల్ మీడియా చర్చల్లో మాత్రం నీ ప్రస్థావన, నీ గురించిన సెటైర్లు మాత్రం కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. డిబేట్లకు పోవుడు ఎవరిష్టం వారు.., కానీ, అంత పెద్ద రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ కూడా పట్టుకుని నోటికెంతొస్తే అంత అంటే ఎవరూ మాత్రం ఊరుకుంటారయ్యా.? గవర్నర్ రబ్బర్ స్టాంపో, గోల్డెన్ స్టాంపో.. ఎట్ల పోల్చుకుంటే అట్ల.. మీ మాటలు, మీ ఇష్టం. కానీ, దానిని పోల్చెదందుకు నడిమిట్ల పాపం గా మాజీ స్పీకర్ ఎందుకొచ్చిండయ్యా.. ఆయనను లాగితివి. ఉద్యమానికి సిరికొండ చేసిన సేవలు మీకు తెల్వదా.. యావత్తు తెలంగాణ ప్రజానీకానికి తెల్వదా.? అధినేతకెప్పుడు ఎదురు చెప్పని స్వభావం, పదవులున్నా లేకున్నా నిండైన మంచి మనస్సున్న వ్యక్తిత్వం మధుసూదనాచారి సొంతమయ్యా. మీరెంతైనా రెడ్డి బిడ్డలు గావచ్చుగాక, మీ పోరాటం గా మరో రెడ్డి బిడ్డ కౌషిక్ రెడ్డి కోసం అయ్యుండొచ్చుగాక కానీ, రాజకీయ కురువృద్ధుడు సిరికొండను అనడం మాత్రం సరికాదయ్యా. భూపాలపల్లి నుంచి సిరికొండ అభిమానులు ఫోన్ చేసి నిలదీస్తే నీకేమో నోట్లె మాటపెగులదాయె.., వాళ్లకేదో సదిరి చెప్పే ప్రయత్నం చేసుడాయె. నోరు జారుడెందుకు, నాలుక కరుచుకునుడెందుకు. మహా మేధావులైన మీరు ఇలా వ్యవహరించడం మస్త్ ఇబ్బంది అనిపిస్తాందన్నా. అయినా, చర్చల్లో పాల్గొన్న ఆసన్నగారూ అదరగొట్టారనిపించుకోవాలంటే కాస్త ఆలోచించి మాట్లాడాలె గానీ, ఆగమాగం నోటికేదొస్తే అది వదిలితే జనాలు మీపై వ్యంగ్యాస్ర్తాలు వదులాల్సి ఉంటదనే స్పృహ ఉంటే మంచిదే జీవనన్నా.. కోసింత చనువు తీసుకుని చెప్పినందుకు ఏమీ అనుకోకే.. మా అర్మూరు బంగారన్నా..

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments