కాంగ్రెస్ యూత్ నాయకుడిపై దాడి చేసిన నలుగురి అరెస్ట్
స్పాట్ వాయిస్, క్రైమ్: హన్మకొండ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ పై దాడి చేసిన ఘటనలో నలుగురిని మంగళవారం సాయంత్రం హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ కేసు వివరాలు వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాత్రి హన్మకొండలో చేపట్టిన యాత్ర ముగిసిన అనంతరం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన పై ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడికి పాల్పడిన నిందితులను గుర్తించారు. వీరిలో చెక్క సుమన్, రావుల కొలను నరేందర్, గుడికందుల వినోద్ కుమార్, సిటిమోర్ సునార్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో సంబంధం ఉన్న మిగితా నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ యూత్ నాయకుడిపై దాడి చేసిన నలుగురి అరెస్ట్
RELATED ARTICLES
Recent Comments