ఏఆర్ ఎస్సై ఆత్మహత్య
కుటుంబ కలహాలే కారణం..
స్పాట్ వాయిస్, ములుగు : కుటుంబ కలహాలతో ఏఆర్ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందినసువర్ణపాక లక్ష్మీ నర్సు(38) బయ్యారంలో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్నారు.
మృతుడి భార్య సునీత గోవిందరావుపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో తన సొంత ఇంట్లో లక్ష్మీనర్సు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే లక్ష్మీనర్సు బలవన్మరణానికి పాల్పడినట్టు బంధువులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments