స్పాట్ వాయిస్ , కాళేశ్వరం: భారీ వరదతో నీట మునిగిన అన్నారం పంపుహౌస్‌లో మోటార్లు, పంపులు బయటపడ్డాయి. అయితే మోటార్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, బురదను శుభ్రం చేసే పనిని చేపట్టామని సంబంధిత ఇంజినీర్లు చెబుతున్నారు. కీలకమైన కంట్రోల్ ప్యానల్ గదిలో కూడా పరికరాలను శుభ్రం చేయడంతోపాటు, అవి ఏమైనా దెబ్బతిన్నాయా అన్నది పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నీట మునిగిన పంపుహౌస్‌ను పునరుద్ధరించే పనిని గత సోమవారం ప్రారంభించారు. సుమారు ఆరువేల హార్స్‌పవర్ సామర్థ్యమున్న భారీ మోటార్లను వినియోగించి నీటిని తోడారు. పంపులు, మోటార్ల వరకు నీటిని తోడి వాటిని శుభ్రపరిచే పన చేపట్టారు. మిగిలిన నీటిని కూడా తోడేశాక వీటిని బయటకు తీసి ఆరబెట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
మేడిగడ్డ పంపుహౌస్..
మేడిగడ్డ పంపుహౌస్‌లో నీటి తోడివేత(డీవాటరింగ్) చేపట్టినా పూర్తిస్థాయిలో నీరు వెళ్ళలేదు. నీటిమట్టం తగ్గడంతోపాటు విద్యుత్తు పునరుద్ధరణ కూడా జరిగాక వేగం పుంజుకొనే అవకాశం ఉంది. ఈ పంపుహౌస్‌లో నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే నీటి తోడివేత పూర్తయితే అసలు విషయం తెలియదు.
Recent Comments