సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు
స్పాట్ వాయిస్, హన్మకొండ: వరంగల్ బస్టాండ్‌లో ప్రయాణికుడికి గుండె పోటు వచ్చింది. అక్కడే ఉన్న స్థానికుడు వెంటనే ట్రాఫిక్ సీఐ బాబు లాల్ కు సమాచారం చేరవేశారు. అయితే బస్టాండ్ సమీపంలో విధులు నిర్వర్తిస్తు్న్న ఎస్సై రామారావును, సిబ్బందిని తక్షణమే సంఘటనా స్థలానికి పంపించారు. వైద్య విద్యార్థిని, ట్రాఫిక్ పోలీసులు వృద్ధుడికి సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షలు చేసి వృద్ధుడి వరంగల్ ఎంజీఎం తరలించారు. బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు ప్రాణాల కోసం శ్రమించిన వైద్య విద్యార్థినిని, ట్రాఫిక్ పోలీసులు చేసిన పనిని కొనియాడారు. అయితే వృద్ధుడిపై విధి చిన్నచూపు చూసింది. తీవ్రమైన గుండె పోటుతో వృద్ధుడు మృతి చెందాడు.
వరంగల్ బస్టాండ్‌లో వృద్ధుడికి గుండెపోటు
RELATED ARTICLES
Recent Comments