ఏఐటీయూసీ నాయకుల వినతి
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ లేబర్ కార్యాలయం (ఏఎల్ఓ) ఏర్పాటు చేయాలని బిల్డింగ్ , ఇతర కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు కుడుదుల వెంకటేష్ చిలకని రాజయ్య కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ భవేష్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ గతంలో ఏఐటీయూసీ ఇచ్చిన దరఖాస్తుల మూలంగా ప్రభుత్వానికి అసిస్టెంట్ లేబర్ కార్యాలయం ఇవ్వాలని లేఖ రాశామని జిల్లా కలెక్టర్ తెలిపారని అన్నారు. త్వరలోనే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఓపికతో కార్మికులు ఉండాలని యూనియన్ ద్వారా అందరికి చెప్పాలని సూచించారన్నారు. కార్మికులకు సంబంధించిన వివిధ క్లెయిమ్ పరిస్థితులను వివరించగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏ ఎల్ వో వినోదతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి పెండింగ్ లో ఉన్న క్లయిమ్ లను తక్షణం కార్మికులకు అందేలా చూడాని ఆదేశించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ వలీ సలీం, బిక్షపతి తదితరులు పాల్గొన్నా
తక్షణమే ఏఎల్ఓ ఆఫీసు ఏర్పాటు చేయాలి
RELATED ARTICLES
Recent Comments