Friday, January 10, 2025
Homeతెలంగాణరాత్రి జైల్లోనే ఐకాన్ స్టార్

రాత్రి జైల్లోనే ఐకాన్ స్టార్

శనివారం ఉదయం బయటికి..
స్పాట్ వాయిస్, బ్యూరో: హీరో అల్లు అర్జున్‌ శుక్రవారం రాత్రి చంచల్‌గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినా.. విడుదల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అల్లు అర్జున్ లాయర్లు పూచీకత్తు బాండ్లు సహా, అవసరమైన పత్రాలన్నింటినీ చంచల్‌గూడ జైలు అధికారులకు సమర్పించారు. జైలు సూపరింటెండెంట్ సెలవులో ఉండటంతో జైళ్ల శాఖ డీజీ వీటిని పరిశీలించారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చంచల్‌గూడ అధికారులు తెలిపారు. కారణాలేంటో తమకు తెలియదు గానీ.. అల్లు అర్జున్ శనివారం ఉదయం 6 గంటల తర్వాతే విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. అధికారుల చెప్పిన సమాచారం విన్న అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తీవ్ర నిరాశతో అక్కడి నుంచి బయల్దేరారు. అల్లు అర్జున్ రాక కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన అభిమానులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సహా బంధువులు సైతం ఒక్కొక్కరుగా జైలు వద్ద నుంచి వెళ్లిపోయారు.

పుష్ప రిలీజ్ 

టాలీవుడ్ న‌టుడు అల్లు అర్జున్( Allu Arjun ) చంచ‌ల్‌గూడ జైలు నుంచి శ‌నివారం ఉద‌యం 6.40 గంట‌ల‌కు విడుద‌ల‌య్యారు. ఈ మేర‌కు చంచ‌ల్ గూడ జైలు అధికారులు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాల‌యానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. మ‌రికాసేప‌ట్లో అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసానికి చేరుకోనున్నారు. అల్లు అర్జున్ నివాసం వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇక జైలు వెనుక గేటు నుంచి అర్జున్‌ను అధికారులు బ‌య‌ట‌కు పంపించారు. గీతా ఆర్ట్స్ కార్యాల‌యం వ‌ర‌కు పోలీసు ఎస్కార్ట్‌తో అల్లు అర్జున్ చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments