14రోజుల రిమాండ్
స్పాట్ వాయిస్, బ్యూరో: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు14 రోజులు రిమాండ్ విధించింది. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు. ఏ 11 కి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Recent Comments