హీరో అల్లు అర్జున్ అరెస్టు..
అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు
స్పాట్ వాయిస్ , బ్యూరో: హీరో అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ కేసులో ఆయన్న విచారించేందుకు చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. ఈ నెల 4న పుష్ప-2 ది రూల్ సినిమా బెనిఫిట్ షోను చూసేందుకు సంధ్య థియేటర్‌కు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అభిమానులతో పాటు ఆయన కూడా సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కు వచ్చారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. వారందరిని చెదరగొట్టే తరుణంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మహిళకు తీవ్రగాయలయ్యాయి. అది గమనించిన పోలీసులు ఆమెను పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేసి, సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు ఆమె మరణించారు. ఈ ఘటనలో ఆమె కుమారుడికి సైతం తీవ్రగాయలయ్యాయి. ఆ బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌పై, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కాగా ఆయన ఇటీవలే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనలో పోలీసులు ఇటీవలే ముగ్గురిని అరెస్ట్ చేశారు. సెక్యూరిటీగార్డ్ సహా థియేటర్ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
కేసులు ఇవీ..
అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 118 (1), బీఎన్‌ఎస్ 105, రెడ్‌విత్ 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 105 సెక్షన్ (నాన్ బెయిలబుల్ కేసు) కింద ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్ ఇప్పటికే ఆమె రూ.25 లక్షలు సాయం ప్రకటించాడు. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నాడు.
Recent Comments