మంగళవారం విచారణకు రావాలని ఆదేశం
స్పాట్ వాయిస్, బ్యూరో: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో విచారణ కోసం A-11గా ఉన్న హీరో అల్లు అర్జున్‌కు నోటీసులు పంపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్‌కు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు ఈనెల 30 వరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్యాప్తు చేసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నోటీసులపై అల్లు అర్జున్ తన లాయర్లతో చర్చించినట్లు తెలుస్తోంది.
Recent Comments