Friday, April 4, 2025
Homeసినిమాపుష్ప సాయం రూ.25 లక్షలు..

పుష్ప సాయం రూ.25 లక్షలు..

రేవంతి కుటుంబానికి ఎంత ఇచ్చిన తక్కువే..
అల్లు అర్జున్ వీడియో రిలీజ్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: పుష్ప 2’ ప్రీమియర్‌ వేళ హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనపై హీరో అల్లు అర్జున్‌ స్పందించారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. బాధితురాలి కుటుంబం కోసం తాను ఉన్నాననేందుకు ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రేవతి పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజకు మెరుగైన వైద్యం అందిస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments