Friday, January 10, 2025
Homeతెలంగాణఅల్లు అర్జున్‌ కేసులో కీలక మలుపు

అల్లు అర్జున్‌ కేసులో కీలక మలుపు

బన్నీకి మధ్యంతర బెయిల్
మంజూరు చేసిన హైకోర్టు
స్పాట్ వాయిస్, బ్యూరో : హైదరాబాద్ సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసులో ఆరెస్ట్‌ అయిన సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అంతకుముందు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు పెట్టిన సెక్షన్‌లు అల్లు అర్జున్‌కు వర్తించవని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపులను అల్లు అర్జున్‌కు నిరాకరించలేమని, ఆయనకు జీవించే హక్కు ఉన్నదని కోర్టు పేర్కొన్నది. మధ్యంతర బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో ఇప్పటికే చంచల్‌గూడ జైలుకు తరలించిన అల్లు అర్జున్‌ను మరికాసేపట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments