రైలు బోగిలకు నిప్పులు
రైల్వే స్టేషన్లలో హై అలర్ట్
స్పాట్ వాయిస్, బ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ను దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుండగా నిరసన సెగ హైదరాబాద్‌కు తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. రైలు బోగిలకు నిప్పుపెట్టడంతోపాటు… స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి… నిరసన తెలిపారు. ఒక్కసారిగా రైలు పట్టాలపై చేరి కేంద్రసర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దీంతో ప్రయాణికులు రైళ్లను వదిలి పరుగులు పెట్టారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా నియామక ప్రక్రియ కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. రైళ్లన్నింటినీ నిలిపివేసిన అధికారులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరంగల్ ,కాజీపేట రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి ఆందోళనలు జరగకుండా గస్తీ కాస్తున్నారు.
Recent Comments