Thursday, November 21, 2024
Homeక్రైమ్చికెన్ కోసం లొల్లి.. యాసిడ్ దాడి

చికెన్ కోసం లొల్లి.. యాసిడ్ దాడి

స్పాట్ వాయిస్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో యాసిడ్‌ దాడి జరిగింది. వేములవాడలోని తిప్పాపూర్‌లో చికెన్‌ నాణ్యత విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పది మంది చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులపై చిరువ్యాపారులు యాసిడ్‌ దాడి చేశారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషంగా ఉందని చెప్పారు. ఈ ఘటనలో పది మందిపై కేసులు నమోదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments