Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుఏసీడీ చార్జీలను రద్దు చేయాలి

ఏసీడీ చార్జీలను రద్దు చేయాలి

ఏసీడీ చార్జీలను రద్దు చేయాలి
బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి
స్పాట్ వాయిస్,నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఏసీడీ చార్జీల పేరుతో కరెంట్ బిల్లులు నిర్భందంగా వసూలు చేస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తుందని, తక్షణమే ఏసీడీ చార్జీలను రద్దు చేయాలనీ, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివారం నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట్ రోడ్ లోని ఆర్ అండ్బీ గెస్ట్ హౌస్ ముందు పార్టీ శ్రేణులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి “ప్రజా పోరు దీక్ష” నిరసన కార్యక్రమం చేపట్టారు. వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు కొండేటి శ్రీధర్ , ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి అతిథులుగా పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతూ కరెంటు చార్జీలు పెంచమని రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఏడు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారన్నారు. దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సక్రమంగా కరెంటు అందక రైతులు రోడ్లమీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని, గిట్టుబాటు ధరల కోసం రైతులు నిలదీస్తే ఖమ్మంలో పోలీసులతో బీడీలు వేయించిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. పంటకు ఎకరాకు 5 వేలు రైతుబంధు ఇచ్చి అన్నింటికీ పరిష్కారం చూపానని గొప్పలు చెప్పుకుంటూ 2014 కి ముందున్న సబ్సిడీలు అన్ని ఎత్తివేశారని రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి నుండి సంవత్సరానికి 8000 రైతులకు ఇస్తున్నదని, ఎరువుల మీద సబ్సిడీ ఇస్తున్నదని, ధాన్యం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులకు ఆదుకుంటున్నదని అన్నారు. 2017 ఏప్రిల్ 13న ప్రగతి భవన్ లో వచ్చే బడ్జెట్లో రైతులకు పూర్తిగా ఉచితంగా ఎరువులు అందిస్తామని చెప్పిన కేసీఆర్ 5సంవత్సరాలు గడిచినా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని తెలంగాణలో మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని ప్రజలను మాయమాటలతో మోసపుచ్చడంలో ప్రపంచంలోనే కేసీఆర్ నెంబర్ వన్ అని రాష్ట్రంలో నియంతృత్వ, నిరంకుశ కుటుంబ పాలన సాగుతోందని టీ ఆర్ ఎస్ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను గ్రహించిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీ ఆర్ఎస్ గా మార్చి దేశాన్ని ఉద్ధరిస్తామని స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఇప్పటికే ప్రజలు వాస్తవాలను తెలుసుకున్నారని త్వరలో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, ఎడ్ల అశోక్ రెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments