స్పాట్ వాయిస్, హైదరాబాద్: జర్నలిస్టులకు గుడ్ న్యూస్. 2022-24 సంవత్సరానికి తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార, పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు 30.06.2022తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్ కార్డ్లు జారీ చేసేందుకు సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్ణయించింది. 25.05.2022 నుంచి 04.06.2022 వరకు డిపార్ట్మెంట్ వెబ్సైట్ http://ipr.telangana.gov.in ద్వారా అక్రిడిటేషన్ కార్డుల కోసం తమ దరఖాస్తులను సమర్పించాలని చెప్పారు. అయితే దరఖాస్తుకు తక్కువ సమయం ఇవ్వడంతో జర్నలిస్టుల సంఘాల విజ్ఞప్తి మేరకు ఈనెల 10వ తేదీ వరకు గడువు పెంచారు.
స్పాట్ ఫ్లాష్.. అక్రిడిటేషన్ దరఖాస్తు గడువు పెంపు..
RELATED ARTICLES
Recent Comments