Thursday, May 22, 2025
Homeక్రైమ్టిఫిన్ బండిపైకి దూసుకెళ్లిన బస్సు 

టిఫిన్ బండిపైకి దూసుకెళ్లిన బస్సు 

టిఫిన్ బండిపైకి దూసుకెళ్లిన బస్సు 

 ముగ్గురి మృతి 

ఓటు వేయడానికి వెళుతుండగా ఘటన 

స్పాట్ వాయిస్, క్రైమ్: ఓటు వేయడానికి సొంత ఊరుకు వెళ్తూ.. రహదారి పక్కన టిఫిన్ చేస్తున్న ముగ్గురుపైకి దూసుకెళ్లిన బస్సు వారి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి జనగామ జిల్లా రఘునాథపల్లిలో జరిగింది. పోలీసులు స్థానికులు తెలిపిన ప్రకారం.. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన తెలుకలపల్లి రవీందర్(38) బతుకుదేరువు కోసం బీబీనగర్కు వలసవెళ్లి పాత సామాగ్రి వ్యాపారం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు చిన్న సమ్మయ్య, భాగ్యమ్మ వరంగల్లోనే ఉంటున్నారు. రవీందర్కు ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పెద్ద కుమారుడు పార్థు(12)ను వారివద్దకు పంపించారు. ఓటు వేసి తన కుమారుడిని ఇంటికి తీసుకువద్దామని భార్య, చిన్న కుమారుడితో స్కూటిపై బీబీనగర్ నుంచి వరంగల్ కు బయలు దేరారు. మార్గమధ్యలో బంక్ పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ తింటుండగా వరంగల్ ఆర్టీసీ డిపో-1 కు చెందిన రాజధాని ఎక్స్ప్రెస్ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న టిఫిన్ సెంటర్ పైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో రవీందర్ భార్య జ్యోతి(32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవీందర్, అతని చిన్నకుమారునికి తీవ్రగాయాలయ్యాయి. హాస్పిటల్ కు తరలించగా రవీందర్ , చిన్నకుమారుడు భవీష్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments