మిర్చి కూలీల ఆటో బోల్తా..
ఒకరి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమo
20 మందికి గాయాలు
స్పాట్ వాయిస్, నర్సంపేట: చెన్నారావుపేట మండలం కోనాపురం శివారు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీ డి గడ్డతండా నుంచి ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా కూలీల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. క్షతగాత్రులను నర్సంపేట హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Recent Comments