రోడ్డు ప్రమాదoలో ఎమ్మెల్యే ఈటల ముఖ్య అనుచరుడి మృతి
స్పాట్ వాయిస్, క్రైమ్: కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదoలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన శంకరపట్నం మండలం కొత్తగట్టు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారు జామున జరిగినట్టుగా భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హుజురాబాద్ మండలం కనుకులగిద్దె సర్పంచ్ గోపు కొమురారెడ్డి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొంది. కొమురారెడ్డి కరీంనగర్ నుండి హుజురాబాద్ వస్తుo డగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. శంకరపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కొమురారెడ్డి బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడిగా ఉంటున్నారు. గత 15 ఏళ్లుగా గ్రామంలో క్రీయ శీలక రాజకీయాల్లో ఉండగా హుజూరాబాద్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా కూడా పని చేశాడు. అనంతరం ఈటల రాజేందర్ వెన్నంటి నడిచి బీజేపీలో చేరారు. కొమురారెడ్డి మరణ వార్త తో హుజురాబాద్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Recent Comments