జయశంకర్ జిల్లా గాంధీనగర్ లో ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన గాంధీనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన మోటపోతుల రాజు (36) ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ పై మైలారం వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. దీంతో రాజు ట్రాక్టర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108లో భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజు మృతితో గాంధీనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
RELATED ARTICLES
Recent Comments